హైదరాబాద్: 28°C
తెలంగాణ

"భూగర్బ జలాల సంరక్షణే లక్ష్యంగా నూతన కార్యక్రమాలు"

SRD: ​నిజాంపేట్ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 2,600 ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించినట్లు ఎంపీడీవో సంగ్రామ్ తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా పనులు ప్రారంభించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇప్పటివరకు 109 పనులకు మాత్రమే మంజూరు లభించిందని పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపునకు దోహదపడే ఈ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని సూచించారు.