SRD: సిర్గాపూర్ మండలం ముబారక్‌పూర్ గ్రామంలో గ్రామ సమైక్య సంఘం నూతన భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ పద్మ విట్టల్ గ్రామస్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని పనులను ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. భవన నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల నిర్వహణ, సమావేశాలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామ సమైక్య భవనానికి భూమి పూజ


