హైదరాబాద్: 28°C
తెలంగాణ

'న్యాయవాదుల హక్కుల కోసం పని చేస్తా'

BDK: భద్రాద్రి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లక్కినేని సత్యనారాయణకు ఆరు పర్యాయాలు సేవలందించే అవకాశం లభించింది. ప్రస్తుతం ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా నేడు నూతన బాధ్యతలు స్వీకరించారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనను ప్రశంసించారు. న్యాయవాదుల హక్కులు, సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.