హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ వాహనాన్ని ఢీకొని ఇద్దరు మృతి

SDPT: హుస్నాబాద్ గణేష్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనం మున్సిపల్ వాహనాన్ని ఢీకొన్న ఘటనలో దద్దునూరి శ్రీకాంత్, బైరి నరసింహ మృతి చెందారు. దద్దునూరి శ్రీనివాసుకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.