హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్

AP: తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన సతీమణి సోఫీ షైన్‌తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ తాను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని, అద్భుతంగా అనిపించిందన్నాడు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, ఇక్కడ ఎంతో సానుకూల శక్తిని అనుభవించానని తెలిపాడు. ఇంత బాగా దర్శించుకునే అవకాశం లభించినందుకు కృతజ్ఞుడనన్నాడు.