BDK: కొత్తగూడెం, విద్యానగర్ కాలనీలో బంజారా కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అంగీకారం తెలిపారు. జేఏసీ జిల్లా ఛైర్మన్ బానోత్ వీరు నాయక్ నేతృత్వంలో నాయకులు ఎమ్మెల్యేను కలిసి భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్


