ASR: అనంతగిరి మండలంలోని జీనబాడు స్వర్ణ గ్రామ సచివాలయంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రభాకరరావు తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలు పీజీఆర్‌ఎస్‌లో వినతుల రూపంలో సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం'


