హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

VZM: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన ఎల్.కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఇవాళ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులందరికీ ఉచితంగా వైద్య సేవలందించి, అవసరమైన మందులు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.