హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల భూములకు నష్టపరిహారం ఇవ్వాలి: మాజీ ఎంపీపీ

SRPT: మునగాల మండలంలో కేంద్రీకృత వంటశాల నిర్మాణానికి భూములు కోల్పోతున్న పేదలకు నష్టపరిహారం ఇవ్వాలని..మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వాసితులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడికి వచ్చిన కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు సమస్యను వివరించారు. బాధితులకు పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.