హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల కమిటీ అధ్యక్షురాలిగా భవ్య ఎన్నిక

SS: నసనకోట ఎం.జే.పి బాలికల గురుకుల పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షురాలిగా రామగిరి మండలం ముత్యాలంపల్లి గ్రామానికి చెందిన భవ్య ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యే పరిటాల సునీతను వెంకటాపురం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భవ్యకు పరిటాల సునీత అభినందనలు తెలిపి, పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.