హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

SKLM: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన పోలాకి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దీర్ఘాసి గ్రామానికి చెందిన మెండ హేమసుందర్(24) నిన్న సాయంత్రం 4 గంటలకు పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు కోమలరావు వెళ్లి చూడగా విద్యుత్ తీగ పక్కన పడి ఉన్నాడు. ఎస్సై రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.