BPT: వేటపాలెం మండలం ఆబాద్‌నగర్‌లో మాబు సుభానీ వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో గ్యార్వి షరీఫ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంగర్ అన్నసమారాధన చేపట్టడంతో పాటు గులామె మష్‌కురో యూసుఫ్ సుభానీ ఆధ్వర్యంలో ప్రత్యేక దువా నిర్వహించారు. మైనారిటీ నేత సయ్యద్ మాబు ఖాదర్ ఖాన్, సభ్యులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఆబాద్‌నగర్‌లో ఘనంగా గ్యార్వి షరీఫ్ వేడుకలు


