హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలను ప్రజావాణి దృష్టికి తీసుకెళ్దాం

GDWL: మండలంలోని పలు సమస్యలను అలంపూర్ మండల ప్రజావాణి అధికారులకు దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు పి కృష్ణమూర్తి నేడు తెలిపారు. డిగ్రీ కాలేజ్, 2009 వరద బాధితుల స్థలాల పంపిణి సమస్య పై ప్రధానంగా అధికారులకు వినతి చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అఖిలపక్ష సభ్యులు అందరూ కలిసి ముందుకు రావాలన్నారు.