WGL: భద్రకాళి అమ్మవారి ఆలయం ఇవాళ సెలవు రోజు సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: భక్తులతో కిక్కిరిసిన భద్రకాళి అమ్మవారి ఆలయం


