ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి గురుకులంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థిని ఇరుప గీతిక సుహాసిని లాంగ్ జంప్‌లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 11న ఆసిఫాబాద్‌లో జరిగే స్టేట్ మీట్‌లో పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు గీతిక సుహాసిని


