KMR: అయ్యపల్లి గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు సోలార్ సీసీ కెమెరాలను ఎస్సై దీప్‌కుమార్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గ్రామంలో భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోకుల్ సాయిరాం యాదవ్, సర్పంచ్ గోనె లింగం, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
అయ్యపల్లిలో సోలార్ సీసీ కెమెరాలు ప్రారంభం


