KMR: రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సూరంపల్లి ప్రభాకర్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
బాధిత కుటుంబానికి సాయం అందచేత


