హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి'

KMR: బీబీపేట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఎంపీడీవో గంగాధర్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.