హైదరాబాద్: 28°C
తెలంగాణ

టచ్ రగ్బీ పోటీల్లో మహేశ్ ప్రతిభ

MDK: తూప్రాన్ టీజీఆర్‌‌ఎస్ బాయ్స్ స్కూల్‌లో జరిగిన జిల్లాస్థాయి అండర్-14 టచ్ రగ్బీ పోటీల్లో నిజాంపేట విద్యార్థి జే.మహేశ్ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ ప్రవీణ్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రస్థాయిలోనూ విజయం సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.