NLG: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. 43 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన వారు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ బ్యాచ్‌తోనే పాఠశాలలో తొలిసారిగా పదో తరగతి తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తుచేసుకున్నారు. పాత మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
తెలంగాణ
43 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


