హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికపై అత్యాచార యత్నం.. వృద్ధుడిపై కేసు

BDK: అశ్వాపురం మండలం బుడుగు బజార్‌లో 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల కోటయ్య (60)పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బస్సు కోసం వేచి ఉన్న బాలికను ఇంటి వద్ద దింపుతానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని దారిలో వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో నిందితుడిపై దాడి చేసిన బాలిక బంధువులు 14 మందిపైనా కేసులు నమోదయ్యాయి.