హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దిప్పకాయలపాడులో కోడిపందేలపై పోలీసుల దాడులు

ELR: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడులో కోడిపందేలపై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వి.చంద్రశేఖర్ ఆదివారం తెలిపారు. గ్రామ సమీపంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసినట్లు చెప్పారు. దాడుల్లో 5 మోటార్ సైకిళ్లు, 2 కోడిపుంజులు, రూ.3,150 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.