హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు నిర్మాణంపై మంత్రి బీసీకి కృతజ్ఞతలు

NDL: సంజామల మండల పరిధిలోని ఎగ్గోని నుంచి ముచ్చలపురి గ్రామానికి రూ.80 లక్షల నిధులతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ఈ రహదారి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.