హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేలేరుపాడులో నాటు సారా పట్టివేత..!

ELR: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 40 లీటర్ల నాటు సారాను కుక్కునూరు మండలం వేలేరు గ్రామం వద్ద జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వేలేరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి సారాను తరలిస్తుండగా పట్టబడినట్లు సమాచారం. వారి వద్ద నుంచి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.