హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల ముఠా గుట్టురట్టు

TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు వెస్ట్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 25 లక్షలు విలువ చేసే 24 చోరీ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వినోద్ కుమార్, గోవిందరాజులు, మురళిలను రిమాండ్‌కు తరలించారు.