హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రసాదంలో తూనీగలు.. భక్తుల ఆందోళన

కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన అంబాజీపేట మండలం ముక్కామల మాజీ సర్పంచ్‌ భాస్కర ప్రసాద్‌ కుటుంబసభ్యులకు అందించిన పులిహోర ప్రసాదంలో తూనీగలు కనిపించడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఛైర్మన్‌ సూర్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రసాదం తయారీ సిబ్బందిని పిలిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.