హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థినులు బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యాలయంలో మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, టాయిలెట్లు, రన్నింగ్ వాటర్, తాగునీటి సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు.