హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

AKP: మత్స్యకారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా నర్సీపట్నం సబ్‌డివిజన్‌ పరిధిలో పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉన్నట్లు డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు, తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, సమూహ సమావేశాలు, మైక్‌ల ద్వారా ప్రచారం నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.