హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చలిసింగంలో మూడు బోర్లకు మంజూరు

AKP: రావికమతం మండలం చలిసింగం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు చొరవ తీసుకున్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు సహకారంతో మూడు బోర్లకు మంజూరు చేయించారు. బోర్ల ఏర్పాటుకు రిగ్గింగ్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివాసీ కుటుంబాలకు తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. ఎమ్మెల్యే చొరవపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.