BHPL: చిట్యాల మండలంలోని నైనుపాక రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నాపాక వర్తక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నూక కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గూట్ల బిక్షపతి, కోశాధికారిగా చిన్నాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడిగా ఎండీ రాజ్ మహమ్మద్ ఎన్నికయ్యారు. వర్తకుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామని సభ్యులు తెలిపారు.
తెలంగాణ
నాపాక వర్తక సంఘం నూతన కమిటీ ఎన్నిక


