హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, ట్రాలీ పట్టివేత

ASF: సిర్పూర్ (టి) మండలం పరిగాం వద్ద అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, ట్రాలీని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ASI రాములు, సిబ్బంది తనిఖీలు చేస్తుండగా కర్జాపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్, ట్రాలీని అడ్డుకున్నారు. డ్రైవర్ సుఖ్ దేవ్ లహారే అనుమతి పత్రాలు చూపించలేకపోవడంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.