హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

W.G: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన సోమవారం యథావిధిగా ప్రజా పిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. సబ్ డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.