NRPT: ఐదు నెలల కాలానికి గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం చేపడుతున్నట్లు డీఈఓ విజయకుమారి తెలిపారు. స్పెషల్ బీఈడీ, జనరల్ బీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, పీజీ డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


