హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు పాస్‌బుక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: మన భూమి - మన హక్కు కార్యక్రమంలో భాగంగా పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో రైతులకు పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొని అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పాస్‌బుక్కులను పంపిణీ చేశారు.అనంతరం రైతులతో ఎమ్మెల్యే మాధవి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.