హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిల్డ్రన్స్ పార్కులో పాము కలకలం

JN: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట చిల్డ్రన్స్ పార్కులో ఆదివారం పాము కనిపించడంతో కలకలం రేగింది. వందలాది మంది పిల్లలు ఆటలాడుతున్న సమయంలో పాము కనిపించడంతో తల్లిదండ్రులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించి పామును కొట్టి చంపారు. పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.