హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 15న జంగుబాయి దసరా ఉత్సవాలు

ADB: నార్నూర్ మండలం గుండాలలో ఆదివారం ఆదివాసీ పెద్దలు సమావేశమయ్యారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కోటపరందొలి-బిడ్ వార్ రాయ్ తడ్ జంగుబాయి దసరా ఉత్సవాలను ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు. ఆచార, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. వివిధ గ్రామాల నుంచి పటేళ్లు, పెద్దలు హాజరయ్యారు.