ASR: పెదబయలు మండలం పెదకోడాపల్లిలో సోమవారం (రేపు) పిజిఆర్‌ఎస్ నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో శ్యామ్ సుందర్ తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలందరూ హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని, వినతులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పెదకోడాపల్లిలో సోమవారం పీజీఆర్ఎస్


