హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి తుమ్మల

KMM: వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పంటలను కాపాడేందుకు సీతారామ ప్రాజెక్టు నుంచి సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాజెక్టులు, చెరువుల ఆయకట్టులకు నీరందించడంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రైతులకు అండగా ఉంటామని వెల్లడించారు.