హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్‌‌గా ఆర్యవీర్ సెహ్వాగ్

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-19 జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. వినూ మన్కడ్ ట్రోఫీ కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 16 మందితో స్క్వాడ్ ప్రకటించింది. విశాఖ వేదికగా అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఆర్యవీర్ జట్టును నడిపించనున్నాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌‌లో ఆర్యవీర్ అద్భుతంగా రాణించాడు.