హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ ముందు గవాస్కర్ ప్రత్యేక టార్గెట్

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 92 పరుగులకే ఔటై సెంచరీ కోల్పోవడం నిరుత్సాహపరిచిందని దిగ్గజం గవాస్కర్ అన్నారు. రిటైర్మెంట్ ప్రకటించే నాటికి, తన వయసు కంటే ఎక్కువ శతకాలు సాధించేలా రోహిత్ లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించాడు. ఆటగాడు రిటైర్ అయ్యే సమయానికి వయసు కంటే సెంచరీలే ఎక్కువగా ఉంటే ఆ అనుభూతే వేరని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 35 శతకాలున్నాయి.