ASR: వాహనాలపై పెండింగ్ ట్రాఫిక్ చలానాలను వెంటనే చెల్లించాలని అరకులోయ ఎస్సై టీ.మల్లేశ్వరరావు ఆదివారం వాహనదారులకు సూచించారు. చలానాలు ఉన్న వాహనాలను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి వాహన బదిలీ, ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి ఆన్‌లైన్ సేవలు నిలిపివేసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు తమ చలానాలను పరిశీలించుకుని సకాలంలో చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ చలానాలు చెల్లించాలి'


