హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరిగి పాలెంలో తాండవిస్తున్న అపరిశుభ్రత

VZM: వేపాడ మండలం అరిగి పాలెంలో అపారిశుధ్యం తాండవిస్తోంది. స్థానిక మధ్య వీధిలో ఉన్న నేల బావి చుట్టూ నాచు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేలబావి పక్కనే తాగునీరు బోరు ఉందని, అపరిశుభ్రత కారణంగా తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు.. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.