అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఆదివారం జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్-19 జిల్లా క్రికెట్ ఎంపికల్లో గుంతకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బి.నందిని రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఆర్డీటీ, ఏడీసీఏ కోచ్‌లు జోషి, యుగంధర్ రెడ్డిల వద్ద ఈమె శిక్షణ పొందింది. నందిని ప్రతిభపై ప్రిన్సిపల్ సాలబాయ్, సిబ్బంది,హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి క్రికెట్‌కు గుంతకల్లు విద్యార్థిని


