హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ సేవా పథకం.. విద్యార్థుల్లో సేవా స్ఫూర్తికి వేదిక

NLR: శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం (NSS) ప్రత్యేక శిబిరంలో రెండో రోజు ఆదివారం రైతులు, గ్రామస్తులకు ఉపయోగకరమైన వివిధ ప్రదర్శనా కార్యక్రమాలు చేశారు. రైతులకు బీజామృతం తయారీ, విత్తనం శుద్ధిపై పద్ధతి ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులకు బీజామృతం తయారీ విధానం గురించి తెలిపారు.