హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

SKLM: విజయనగరం పార్లమెంట్ పరిధికి చెందిన 18 మంది లబ్ధిదారులకు రూ.12.10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం రణస్థలం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్య బాధితుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సాయం మంజూరైందని, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని ఎంపీ తెలిపారు.