హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం'

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని ఓపికగా విన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.