హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3డీ కాంక్రీట్ ఇళ్ల నిర్మాణంపై పవన్ హర్షం

గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పీఎంఏవై-గ్రామీణ్ 2.0 కింద దేశంలోనే తొలిసారిగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతతో కేవలం 10 రోజుల్లోనే దృఢమైన ఇళ్లను నిర్మించవచ్చని తెలిపారు. నాణ్యతతో పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తోందన్నారు.