హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంటి ఆవరణలో నాగుపాము హల్‌చల్‌

BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో ఆదివారం కలకలం రేపింది. మామిడాల శరత్‌ ఇంటి ఆవరణలోకి నాగుపాము రావడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. పామును గుర్తించిన వెంటనే స్నేక్‌ క్యాచర్‌ రహీంకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.