హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయం వద్ద మావటిని తొక్కిన ఏనుగు

TPT: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాహన మండపం సమీపంలో మావటి చంద్రయ్యపై ఏనుగు దాడి చేసింది. అతడిని బాగా తొక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి సిబ్బంది తరలించారు. ఒక్కసారిగా ఏనుగు దాడికి దిగడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు.