హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పద్మాపురంలో రేపు PGRS కార్యక్రమం

అరకు: లోయ మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ నిశాంతి టి. ఆదేశాల మేరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.